Saturday, November 17, 2012

మా బుడ్డిగాడికి belated birthday wishes….





మా బుడ్డిగాడంటే, మా అక్క కొడుకు. మా అల్లరి పిడుగు, మా బంగారు కొండ. మా అక్కచెల్లెళ్ళలో చాలా డిఫరెన్సెస్ ఉన్నా గానీ, మా అందరికీ ఉన్న ఏకైక ఏకాభిప్రాయం వాడే.
అది November 15th, 2009..
Hospital corridor లో సీరియస్ గా మేమందరం wait చేస్తున్నాం, మనోడి కోసం..నేనైతే కెమేరా పట్టుకుని మరీ వెయిటింగ్ ఎప్పుడు బయటికి తీసుకురాంగానే అప్పుడు ఫోటో తీసేద్దామని. Ofcourse మా అక్క నాకు serious warning ఇచ్చిందనుకొండి, ఫోటో తీయొద్దని, తీస్తే చంపేస్తానని, కానీ మా అక్క అప్పుడు లోపల ఉంటుందనే ధైర్యంతో proceed అయ్యాను. ఇంతలో నర్స్ బయటకు వచ్చి చెప్పింది మగ పిల్లాడని,  వెనకాలే ఇంకో నర్స్ మా బుడ్డిగాడిని తీసుకువచ్చేసింది. అదే మావాడి గ్రాండ్ ఎంట్రన్స్, బాక్ గ్రౌండ్ సాంగ్ వేసుకున్నాం. నేను టక్కున ఫోటో తీసాను, రయ్యిమని ఫ్లాష్ వెలిగింది, మా వాడు కయ్యిమని రాగం తీసాడు, మా నాన్నకి సుయ్యిమని కోపం వచ్చింది, నా గుండు టంగ్ మని మోగింది, మా నాన్న మొట్టికాయతో. అందరం వాడి వెనకాలే, అదే నర్స్ వెనకాలే వెళ్ళాం, మా అక్కని వదిలేసి మరీ.


 మా వాడు మా ఇంట్లోనూ పెద్ద మనవడు, మా బావ వాళ్ళింట్లో కూడా. ఇంక ఆడిందే ఆట, పాడిందే పాట. కానీ వాడికి కేవలం ఆట, పాట మాత్రమే వచ్చనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే, వాడి achievements కొన్ని మచ్చుకు, మా స్మార్ట్ ఫోన్ లో మాకే తెలియని సెట్టింగ్స్ మార్చడం, వాళ్ళ నాన్న లాప్టాప్ ని నాశనం చేయడం, మా నాన్నకే డ్రైవింగ్ నేర్పడం, మా తాతకి కధలు చెప్పడం, మా అమ్మని రకరకాలుగా పరిగెత్తించడం, వాడి ఫోటోలు వాడే తీసుకోవడం లాంటివి.
 మా బుడ్డిగాడు ఇలాగే అల్లరి చేస్తూ ఇంకో వంద బర్త్ డేలు చేసుకోవాలని కోరుకుంటూ.... మీరందరూ కూడా వాడిని దీవించండేం.

కొసమెరుపేమిటంటే మా బుడ్డిగాడు వాడి బర్త్ డే సందర్భంగా వాళ్ళ టీచర్ కి గిఫ్ట్ ఇస్తానని ప్రామిస్ చేస్తే మా బావ, కొడుకు మాట కోసం ఓ మంచి గిఫ్ట్ కొని మరీ తీసుకెళ్ళాడు.

4 comments:

  1. నా విష్సెస్ కూడా...కేక్ బాగుంది నాకు పెట్టవా బుజ్జి:-)

    ReplyDelete