Tuesday, October 30, 2012

మా సీత కధ. . . .


కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే సినిమాలు కూడా ఎందుకూ పనికి రావేమో అనిపిస్తూ ఉంటుంది. నిజానికి దేవుడే నాకు తెలిసిన గొప్ప స్క్రీన్ ప్లే రైటర్. ఇదే విషయం నాకు ఎన్నో సార్లు ప్రూవ్ కూడా చేసాడనుకోండి కాని ప్రతిసారి అవునా.. అనుకోకుండా ఉండలేను.

ఇంతకీ విషయంలోకి వచ్చేస్తే,

ఒక చిరుజల్లు పడుతున్న రోజు సాయంత్రం నేను ఎప్పటిలానే మా చాకలిని తిట్టుకుంటూనే, గుట్టలా ఒకే దగ్గర ఆరేసిన బట్టలన్ని సరిచేసి క్లిప్పులు పెట్టుకుంటూ ఉంటే నాకు తోడుగా పైకి వచ్చిన సీత సడెన్ గా అరిచింది "దీదీ దెఖొనా టూట్తా హువ తారా. కుచ్ విష్ తో కరో." ఇలాంటివన్నీ నమ్ముతావా నువ్వు అని నేనడిగితే అప్పుడు చెప్పింది తన ట్విస్టుల కధ. అదే మా సీత కధ. ఇంతకీ సీత, నేను దేశానికి ఒకళ్ళు ఆ మూల నుంచి,ఒకళ్ళు ఈ మూల నుంచి పొట్ట కూటి కోసం చాలా మంది లాగా భాగ్యనగరికి వచ్చిన వలస పక్షులం. నాది దివిసీమ ఐతే సీతది భిలాయ్. తనని మొదటిసారి చూస్తే అనిపించింది నాకు - ఇంత అమాయకులు, మంచివాళ్ళు ఇంకా ఉన్నారా అని. 

ఎంసిఎ చదివిన సీత హాస్టల్లో ఉండటం ఇదే మొదటిసారి.చదివినంత కాలం ఇంట్లోనే ఉంది. ఇప్పుడిక జాబ్ కోసం ఇలా వచ్చింది. వచ్చిన కొత్తలో చాలా భయపడుతూ ఉండేది. ఇప్పుడు బాగానే అలవాటు పడిందిలెండి.

సీత వాళ్ళది చిన్న ఫామిలీ. అమ్మ, నాన్న, సీత ఇంకా సీత చెల్లి రీటా. తెలుగు వాళ్ళే. ఎప్పుడో పూర్వీకుల కాలంలోనే అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యారంట. వాళ్ల నాన్నగారు ఆడపిల్లలు బాగా చదువుకోవాలని ఆశతో, ఇంత చదివించి జాబ్ కోసం ఇంత దూరం పంపించారు. మన అందరి చుట్టాల్లానే(రాబందులు)సీత వాళ్ళ చుట్టాలు కూడా సీత నాన్నగారిని బాగా డిస్కరేజ్ చేసేవాళ్ళు. ముఖ్యంగా సీత మేనత్త. ఎందుకంటే ఆవిడకి ఒక చదువబ్బని గాలికి తిరిగే బేవార్సు కొడుకు వున్నాడు. ఆవిడకి మన సీత 
మీద ముఖ్యంగా సీత ఆస్తి మీద కన్ను పడింది మరి. ఒకసారి సీత డిగ్రీ చదువుతున్నప్పుడు ఇంటికి వచ్చారు సంబంధం కలుపుకోవడానికి. నాయనమ్మ ప్రొద్బలంతొ నాన్న మాట కాదనలేక సీత వప్పుకుంది. వాడు ఇల్లరికం రావడానికి రెడీ ఐనా, పిచ్చి వేషాలేస్తున్న సీత ఊరుకుంది. కాని తన తండ్రి విషయంలో వాడి,వాడి తల్లి దురుసు ప్రవర్తనని మాత్రం భరించలేకపోయింది. ఎందుకు ఇల్లరికం అంటే వాళ్ళు చెప్పిన సమాధానం " మీ నాన్నఎప్పటికీ బ్రతికే ఉంటాడా?" అప్పుడే సీత నిర్ణయం తీసుకుంది ఈ వెధవతో పెళ్ళి వద్దని. ఇక్కడ దాకా అందరికి తెలిసిన కధే. 

ఇంక సీత ఇవన్నీ పక్కకి పెట్టి బుద్ధిగా పిజి చేస్తున్నప్పుడు ఒక రోజు సాయంత్రం ఫొన్ మోగింది. Unknown number. ఆన్సర్ చెస్తే ఎవరో అబ్బాయి. చాలా పద్దతిగా మట్లాడడు. ఫ్రెండ్లీగ మాట్లాడాడు.ఎప్పుడు అబ్బాయిలతో పెద్దగా మాట్లాడని సీత కూడా అతను చూపించే అడ్మిరేన్ కి, అటెన్షన్కి మెల్లగా అలవాటు పడింది. ఫామిలీ ఫ్రెండ్ ని చేసుకుంది. ఇలా ఆ స్నేహం మెల్లగా ప్రేమగా మారింది. 

సీతకు తెలియకుండానే. ఒక రోజు అతని నుంచి ఫోన్ కాల్ బాగా చదువుకో సీత, జాగ్రత్తగా ఉండు అని. ఏదో తేడాగా అనిపించినా ఊరుకుంది. తెల్లారి నుంచి నో కాల్, నో రెస్పాన్స్. స్విచెడ్ ఆఫ్. ఏం జరిగింది? ఎందుకిలా అయింది? ఎంత ఆలోచించినా తెలియని విషయం. ఎన్నో జవాబు లేని ప్రశ్నలు, ఇంకెంతో కన్నీరు. పిచ్చిదానిలాగా అయింది.


ఒకరోజు ఏదైనా అప్డేట్ పెట్టాడెమో అని ఆశ చావక ఫేస్ బుక్ చూస్తే ఆశ్చర్యం. .  mutual friends listలో పుష్ప పేరు కనిపించింది. పుష్ప ఎందుకు ఇక్కడ ఉంది. పుష్ప తన దురుసు మేనత్త గడుసు కూతురు. ఇతనికి పుష్ప తెలుసా? ఎలా తెలుసు? తెలిస్తే ఇతను ఎప్పుడూ తనకు ఎందుకు చెప్పలేదు? ఏదో క్లూ దొరికినట్టయింది. మెల్లగా ఆలోచిస్తే మబ్బు విడిపొయినట్టయింది. అంటే తను మోసపోయిందా? లేదు ఇన్నాళ్ళూ 
తమ మద్య జరిగింది నాటకం కాదు. అతని కళ్ళల్లో కనిపించే తన పట్ల ప్రేమ,తన ఫామిలీ పట్ల కన్సర్న్ఏదీ అబద్దం కాదు.కాకూడదు. దేవుళ్ళందరికీ మొక్కేసుకుంది. ఎక్కడో నమ్మకం తనకి అలా జరగదు. వద్దు వద్దనుకుంటూనే వెంటనే పుష్పకి కాల్ చేసింది. అతని గురించి చెప్పమని బతిమాలుకుంది. కాని రాక్షసికి మనసు కరగలేదు. నా అన్నని కాదంటావా అనుభవించు. బాగా ట్రాప్ చేసానా? పుష్ప సమాధానం. 

అయిపోయింది.అంతా అయిపోయింది. ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఆశే లేకుండా బతుకుతున్న తనకు మూడు నెలల తరువాత ఒక రోజు అతని నుంచి ఫోన్."సీతా" ఒక్కసారిగా తను మొత్తం కన్నీరయింది. మళ్ళీ అతనే " ఫ్లీజ్ నన్నుక్షమించవూ " అతను ఆపలేదు, సీత సమాధానం కోసం ఎదురు చూడలేదు. చెప్పుకుంటూ పోయాడు, జరిగిందంతా. పుష్ప తనకు నంబర్ ఇవ్వడం, తను కాల్ చేయడం, కానీ నిజంగా ప్రేమలో పడడం, కానీ సీతకు చెప్పలేకపోవడం అంతా అంతా చెప్పి ఆగాడు. “ఇంకా నన్ను నువ్వు ప్రేమిస్తున్నవా? ప్లీజ్ సీతా కాదని మాత్రం అనకు ప్లీజ్" వింటున్న మా సీత ఆనందం అంతా ఇంతా కాదు. నవ్వుతూ ఊ కొట్టింది. 

ఇప్పటికీ నవ్వుతూనే ఉంది, ఆనందంగా అతని ప్రేమలో.
ఇప్పటికి మూడు సంవత్సరాలయింది.

No comments:

Post a Comment